Share News

వాటరింగ్‌ చేస్తారా.. లేదా?

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:09 PM

సింగిడి రోడ్డు మరమ్మతు పనులను బుధవారం ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. వాటరింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

 వాటరింగ్‌ చేస్తారా.. లేదా?
పనులను అడ్డుకుంటున్న గ్రామస్థులు

భామిని: సింగిడి రోడ్డు మరమ్మతు పనులను బుధవారం ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. వాటరింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి 20 రోజులు గడుస్తున్నా.. వాటరింగ్‌ ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ధూళి రేగుతుండడంతో నిత్యం వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాటరింగ్‌ చేసిన తర్వాతే మెటల్‌ డెస్ట్‌ పనులను చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో అక్కడి పనివారు కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని తెలిపారు. రేపటి నుంచి వాటరింగ్‌ చేస్తామని కాంట్రాక్టర్‌ చెప్పినా గ్రామస్థులు ఒప్పుకోలేదు. చివరకు మెటల్‌ డెస్ట్‌ పనులను నిలిపివేశారు.

Updated Date - Jan 17 , 2024 | 11:09 PM