Share News

స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:25 AM

స్వచ్ఛ సుందర పార్వతీపురంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరీ కోరారు.

స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగస్వాములు కావాలి
పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న మునిసిపల్‌ సిబ్బంది:

పార్వతీపురంటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సుందర పార్వతీపురంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరీ కోరారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్‌ క్లబ్‌లు, యువజన సంఘాల సభ్యులు స్వచ్చ సుందర పార్వతీపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, శానటరీ ఇన్‌స్పెక్టర్‌ పకీరు రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:25 AM