Share News

నిధుల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:59 PM

జిల్లాలోని వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన నిధులు(డైట్‌ బిల్లులు) మంజూరు కాలేదు. అలాగే కాస్మోటిక్‌ చార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఐదు నెలల నుంచి ఈ సమస్య ఉంది. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. చేసేదిలేక ఆయా సంక్షేమ అఽదికారులు చేతి డబ్బులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నెలలుగా బిల్లుల కోసం ఆయా వార్డెన్లు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభావం విద్యార్థుల

నిధుల కోసం నిరీక్షణ

నిధుల కోసం నిరీక్షణ

వసతి గృహాలకు ఐదు నాలుగునెలలుగా అందని డైట్‌ బిల్లులు

కాస్మోటిక్‌ చార్జీలదీ అదే పరిస్థితి

చేతి డబ్బులు పెడుతున్న సంక్షేమ అఽదికారులు

కలెక్టరేట్‌, మార్చి 11:

జిల్లాలోని వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన నిధులు(డైట్‌ బిల్లులు) మంజూరు కాలేదు. అలాగే కాస్మోటిక్‌ చార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఐదు నెలల నుంచి ఈ సమస్య ఉంది. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. చేసేదిలేక ఆయా సంక్షేమ అఽదికారులు చేతి డబ్బులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నెలలుగా బిల్లుల కోసం ఆయా వార్డెన్లు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభావం విద్యార్థులకు అందజేస్తున్న భోజనంపై పడుతోంది. నాణ్యత తగ్గుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో 38 ప్రీమెట్రిక్‌, 15 కళాశాల వసతిగృహాలున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 14 ప్రీమెట్రిక్‌, మరో 16 పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలున్నాయి. వాటిల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. భోజనంలో నాణ్యత ఉండడం లేదని, మెనూ పాటించడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు విద్యార్థులు వాపోయారు. బిల్లులు చెల్లించకుంటే ఎలా అని వార్డెన్లూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఐదు నెలల నుంచి డైట్‌ బిల్లులు అందక పోవడంతో సంక్షేమ అధికారులు చేతి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కొంతమంది అప్పులు చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు అందజేయనున్న కాస్మోటిక్‌ చార్జీల నిధులు నాలుగు నెలలు నుంచి విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని నూనె, షాంపులు, పౌడర్‌లు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డైట్‌ బిల్లులతో పాటు కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై ఏబీసీడబ్య్లూవో యశోధనరావు వద్ద ప్రస్తావించగా డైట్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీల బిల్లులు రెండు మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం నివేదిక అడిగాక వివరాలు నివేదించామని చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 11:59 PM