పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:18 AM
: పురిటిపెంట పంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం గజపతినగరంలో మెయిన్ రోడ్డులో ర్యాలీచేసి చెత్తకుప్ప వద్ద పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వేతనాలు పెంచాలని ఐదురోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకనే నాథుడే లేరన్నారు. రోజుకు చెల్లించే రూ.300ల కూలీతో దినసరి వేతనం సరి పోక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనాలు పెంచ డంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, హెల్త్ అలవెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గజపతినగరం: పురిటిపెంట పంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం గజపతినగరంలో మెయిన్ రోడ్డులో ర్యాలీచేసి చెత్తకుప్ప వద్ద పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వేతనాలు పెంచాలని ఐదురోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకనే నాథుడే లేరన్నారు. రోజుకు చెల్లించే రూ.300ల కూలీతో దినసరి వేతనం సరి పోక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనాలు పెంచ డంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, హెల్త్ అలవెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాయుడు తదితరులు పాల్గొన్నారు.