కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Mar 23 , 2024 | 12:06 AM
రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులెవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షంలో చర్యలు తప్పవని ఆర్డీవో, చీపురుపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.శాంతి స్పష్టం చేశారు.
చీపురుపల్లి: రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులెవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షంలో చర్యలు తప్పవని ఆర్డీవో, చీపురుపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.శాంతి స్పష్టం చేశారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయాన్ని అందరూ గమ నించాలన్నారు. ఎన్నికలతో ముడిపడి ఉన్న ప్రతి పనికీ రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి మంజూరు కోసం సువిధ పేరుతో కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇంటింటి ప్రచారం మొదలుకుని, సభలు, సమావేశాల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్వో సూచించారు. ఏప్రిల్ నెల 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములు, 3 స్టాటస్టిక్ సర్వలెన్స్ టీములు, 1 వీడియో సర్వలెన్స్ టీము పని చేస్తున్నాయన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని 160 ప్రదేశాల్లో 257 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకూ నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చునని చెప్పారు. నియోజక వర్గం పరిధిలోని తహసీల్దార్లు ఏఆర్వో లుగాను, ఎంపీడీవోలం తా ప్రవర్తనా నియమావళికి నోడల్ అధికారులు గాను వ్యవహరిస్తారని ఆర్వో వివరించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలో సరైన ఆధారాలు చూపించకుం డా నగదు తీసుకెళ్లకూడ దన్నారు. పరిమితికి మించిన నగదు సీజ్ అయిన పక్షంలో జిల్లా స్థాయి కమిటీ ఎదుట సరైన ఆధారాలు సమర్పించి, నగదును వెనక్కి తీసుకోవ చ్చునని ఆర్వో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్వో శాంతి వివరించారు. ఆమెతో బాటు చీపురుపల్లి తహసీల్దార్ ఎన్.ప్రసాద్‌రావు, డీటీ సంతోష్, ఎంపీడీవో డి.శ్వేత, సీఐ సీహెచ్ షణ్ముఖరావు, ఇతర మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఉన్నారు.
నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
బొబ్బిలి: ఎన్నికల నిబంధనల ను కచ్చితంగా అమలు చేయాలని మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో పురపాలక, సచివాలయాల సిబ్బందికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌పై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ర్యాలీలు, సభలు, సమా వేశాలు ఈసీ నియమావళికి అనుగుణంగా ఉండేలా పర్యవేక్షించాలని, అనుమతి లేకుండా ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించరాదని తెలిపారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని, ఇంటింటి ప్రచారంలో భాగంగా స్టిక్కర్లను తొలగించాలని, ఇంటి యజమాని అనుమతి లేకుండా ఎటువంటి జెండాలు ఏర్పాటు చేయరాదని చెప్పారు. మైక్, సౌండ్ సిస్టమ్ వినియోగించేందుకు అనుమ తి తప్పనిసరి పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవికుమార్, ఈఓపీఆర్డీ అల్లు భాస్కరరావు, టీపీఎస్ వరప్రసాద్, టీపీఆర్ఓ జగన్మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు రవి, సురేష్ పాల్గొన్నారు.