Share News

గెలుపుఖాయం: లోకం నాగమాధవి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:17 AM

నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలుపు ఖాయమని పార్టీ అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు.

గెలుపుఖాయం: లోకం నాగమాధవి
మాట్లాడుతున్న జనసేన అభ్యర్థి మాధవి

భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలుపు ఖాయమని పార్టీ అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. ముంజేరు సమీపంలోని మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ అధినేత పవన్‌కల్యాణ్‌ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కలిసే అన్ని నిర్ణయాలు తీసుకొని గెలుపునకు బాటలు వేస్తామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వందనాల రమణ, పల్లంట్ల జగదీష్‌, తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:17 AM