డీఐవోఎస్‌గా వెంకటరావు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:01 AM
పాలకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డీఐవోఎస్‌గా పి.వెంకటరావు నియమితులయ్యారు.

పాలకొండ: పాలకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డీఐవోఎస్‌గా పి.వెంకటరావు నియమితులయ్యారు. గతంలో డీఐవోఎస్‌గా ఉన్న ప్రేమ్‌కుమార్ ఉద్యోగ విరమణతో వెంకటరావుకు పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఐటీడీఏ ఏపీవోగా చిన్నబాబు
సీతంపేట: సీతంపేట ఏపీవోగా జి.చిన్నబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదేశానుసారం ఐటీడీఏ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు ప్రభుత్వ పథకాలు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయన విశాఖపట్నంలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై సీతంపేటకు ఏపీవోగా వచ్చారు.