Share News

వంశధార నదిలో శవమై..

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:11 AM

తాలాడ గ్రామానికి చెందిన వలరౌతు నిరంజీన్‌(52) శనివారం ఉదయం కోసలి గ్రామం వద్ద వంశధార నదిలో శవమై తేలాడు.

వంశధార నదిలో శవమై..

భామిని: తాలాడ గ్రామానికి చెందిన వలరౌతు నిరంజీన్‌(52) శనివారం ఉదయం కోసలి గ్రామం వద్ద వంశధార నదిలో శవమై తేలాడు. పోలీసులు, స్థానికులు కథనం మేరకు నిరంజన్‌ గురువారం సాయంత్రం నది అవతల ఒడిశా కాశీనగర్‌ వెళ్లి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి వస్తున్నాడు. ఆ సమయంలో పడవ లేకపోవడంతో నది దాటుతున్న సమయంలో నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారన్నారు. అయితే గురువారం రాత్రి వరకు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందగా శుక్రవారం నదీతీర ప్రాంతాలను యువత జల్లెడపట్టారు. అయినప్పటికీ ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం కోసలి సమీపంలో నదీ తీరాన శవమై తేలిన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. బత్తిలి ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి కోసలి వద్ద పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరంజన్‌కు భార్య శారద, ముగ్గురు కుమార్తెలున్నారు. మృతితో తాలాడ గ్రామంలో విషాదం అలముకుంది.

Updated Date - Aug 25 , 2024 | 12:11 AM