Share News

వైద్య శిబిరాలను వినియోగించుకోండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:08 AM

ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్‌.భాస్క రరావు పేర్కొన్నారు.

వైద్య శిబిరాలను వినియోగించుకోండి

బొండపల్లి: ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్‌.భాస్క రరావు పేర్కొన్నారు. ఒంపల్లిలో ని సచివాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శస్త్ర చికిత్సలు అవసరమైన రోగులను సంబంధిత ఆసు పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకునేలా చూడాల్సిన బాధ్యత ఆశా కార్యకర్తలతో పాటు హెల్త్‌వెల్‌నెస్‌ కేంద్రాల సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎల్‌.సత్యనారాయణ, సీహెచ్‌ వో రాజగోపాల్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ బాషా, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బి.విశ్వేశ్వరరావు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:08 AM