రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:13 AM
మండలంలోని తుమ్మికాపల్లి సమీపంలోని గేట్ వద్దరైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని మృతదేహం కనిపించిందని విజయనగరానికి చెందిన రైల్వే ఎస్‌ఐ రవి వర్మ తెలిపారు.
కొత్తవలస, జూన్ 20: మండలంలోని తుమ్మికాపల్లి సమీపంలోని గేట్ వద్దరైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని మృతదేహం కనిపించిందని విజయనగరానికి చెందిన రైల్వే ఎస్‌ఐ రవి వర్మ తెలిపారు. మృతుని వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. రైలులో నుంచి జారిపడ్డం కారణంగానే మృతి చెంది ఉండొచ్చునని తెలిపారు. మృతుని సమాచారం తెలిసినట్టయితే విజయనగరం, కొత్తవలస పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.