బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:28 AM
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి కోరాడ వీధి శివారు సాదీఖానాకు ఆనుకుని ఉన్న రాణీమల్లమ్మదేవి చెరువు గట్టు వద్ద సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి కోరాడ వీధి శివారు సాదీఖానాకు ఆనుకుని ఉన్న రాణీమల్లమ్మదేవి చెరువు గట్టు వద్ద సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. పోలీస్‌లు, సీఐ సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కానిస్టేబుల్ చలపతిరావు, అక్కడే వున్న బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు రేవళ్ల కిరణ్‌కుమార్ గట్టుపైకి తీసుకొచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే బొబ్బిలి పోలీస్ స్టేషన్‌కి 91211 09422, 91211 09454 నెంబర్లపై సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.