Share News

గిరిజనుల హక్కులను కాపాడాలి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:56 PM

గిరిజనుల హక్కులను కాపాడాలని, కురుపాంలో నిజమైన గిరిజ నులకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు కె.ధర్మా రావు డిమాండ్‌ చేశారు.

 గిరిజనుల హక్కులను కాపాడాలి

బెలగాం: గిరిజనుల హక్కులను కాపాడాలని, కురుపాంలో నిజమైన గిరిజ నులకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు కె.ధర్మా రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక గిరిజన భవన్‌లో గిరిజన సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములు కేటాయించ వద్దని, కోనేరు రంగారావు కమిటీ సూచించిన జీవో అమలు చేసి గిరిజనుల వలసలు నివారించా లని డిమాండ్‌ చేశారు. జీవో నెంబరు 3కు బదులుగా కొత్త రెగ్యులేషన్‌ పాలసీ అమలు చేయాలని, జగనన్న భూహక్కు పథకం షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో 1959ని ప్రామాణికంగా తీసుకోవాలని టీఏసీలో 13 మంది ఎస్టీ ఎమ్మెల్యేలను నియమించి బలోపేతం చేయాలని, నకిలీ ఎస్టీ ధ్రువపత్రాల రద్దుపై ప్రత్యేక కమిటీ నియమిం చి త్వరితగతిన విచారించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్‌ నియోజకవర్గాల్లో నిజమైన గిరిజనులకే సీట్లు ఇవ్వాలని, బోయ వాల్మీకులను ఎస్టీ లో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల జేఏసీ నా యకులు ఎ.నీలకంఠం, డి.సీతారాం, కె.ఉదయ్‌, కె.గౌరమ్మ, కె.జయన్న, ఐ.రామ కృష్ణ, ఎల్ల లోవరాజు, పువ్వల అప్పన్నదొర, పువ్వల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:56 PM