అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:29 AM
తాటిపూడి రిజర్వాయర్ ఆవల ఉన్న డీకేపర్తి పంచాయతీ పరిధిలో గల పెద్దపాడుకు చెందిన ఏర్రబోయిన దీన(4) అ నారోగ్యంతో మృతి చెందింది.
గంట్యాడ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్ ఆవల ఉన్న డీకేపర్తి పంచాయతీ పరిధిలో గల పెద్దపాడుకు చెందిన ఏర్రబోయిన దీన(4) అ నారోగ్యంతో మృతి చెందింది. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దీన తండ్రి సీతయ్య గ్రామానికి దూరంలో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ తన కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపో వడంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు.