తోటపల్లి కాలువకు గండి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:39 PM
బాడంగి మండలం అల్లు పాల్తేరు వద్ద తోటపల్లి కాలువకు శుక్రవారం భారీ గండి పడింది.

బాడంగి, జూలై 5: బాడంగి మండలం అల్లు పాల్తేరు వద్ద తోటపల్లి కాలువకు శుక్రవారం భారీ గండి పడింది. ఇదే చోట కొద్దిరోజుల క్రితం కాలువకు గండిపడింది. ఇక్కడ అధికారులు ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో నీటి ఉధృతిని ఇసుక బస్తాలు నిలువరించలేకపోయాయి. నీటి ప్రవాహానికి బస్తాలు కొట్టుకుపోవడంతో అదేచోట మళ్లీ గండి పడింది. ఇప్పటికైనా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.