Share News

ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:13 AM

దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి గురువారం కొత్తవలస కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

ముగ్గురి అరెస్టు

కొత్తవలస, జూలై 4: దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి గురువారం కొత్తవలస కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. జామి మండలానికి చెందిన సయ్యద్‌ బాషా, కొత్తలి సూర్యనారాయణ బుధవారం ఉదయం జామి నుంచి మోటార్‌సైకిల్‌పై విశాఖపట్టణం వెళ్లి రాత్రి తిరిగి వస్తూ కొత్తవలస వసంత్‌ విహార్‌ ఎదురుగా ఉన్న పాన్‌షాపులో వాటర్‌ బాటిల్‌, డ్రింకు బాటిల్‌ కొనుగోలు చేస్తుండగా కొత్తవలస గ్రామానికి చెందిన పి.శ్యామ్‌కుమార్‌ మరో ఇద్దరు యువకులు వారిని బెదిరించి వారివద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్‌లు దౌర్జన్యంగా తీసుకున్నారు. దీనిపై సయ్యద్‌ భాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని గురువారం అరెస్టు చేసి కొత్తవలస కోర్టుకు తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 12:13 AM