బరిలో ఉన్నది వీరే..
ABN , Publish Date - May 12 , 2024 | 11:32 PM
అరకు పార్లమెంట్ పరిధి పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు సార్వత్రిక పోరులో నిలిచారు.

పోటీలో ప్రధాన పార్టీ అభ్యర్థులు
పార్వతీపురం, మే12 (ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్ పరిధి పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు సార్వత్రిక పోరులో నిలిచారు. టీడీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోయక జగదీశ్వరి, వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి, సీపీఎం అభ్యర్థిగా మండంగి రమణ పోటీలో ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి బోనెల విజయచంద్ర, వైసీపీ నుంచి అలజంగి జోగారావు, కాంగ్రెస్ నుంచి బి.మోహన్‌రావు బరిలో ఉన్నారు. పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ, వైసీపీ అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి, కాంగ్రెస్ పార్టీ తరపున సవర చంటిబాబు పోటీలో ఉన్నారు. సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి, వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర, కాంగ్రెస్ నుంచి ఎం.పుష్పారావు పోటీలో ఉన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నుంచి కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థి తనూజారాణి తలపడుతున్నారు.