Share News

ఇవి ఎన్నికల ‘యాప్‌’లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:48 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం వివిధ ఓటర్ల కు పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు... సాంకేతిక సహకారం అం దించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.

ఇవి ఎన్నికల ‘యాప్‌’లు

- పారదర్శకంగా నిర్వహణకు మార్గాలు

(గరుగుబిల్లి)

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం వివిధ ఓటర్ల కు పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు... సాంకేతిక సహకారం అం దించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు చే సేందుకు, అలాగే ఓటర్లకు ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌లు, పోర్టర్‌లు, వెబ్‌సైట్‌లు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌లను వినియోగించు కొనేందుకు అధికంగా ముందుకు వస్తున్నారు. తప్పు చేసిన వారికి క్షణా ల్లో శిక్ష అమలయ్యేలా రూపొందించింది. వాటిని ఓసారి చూద్దాం..

ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’

ఓటర్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు గా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ (వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం రూపొందిం చింది. ఇందులో ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. జాబితా లో పేర్లు ఉన్నాయా? లేదా? అన్నది సులువుగా తెలుసుకోవచ్చు. ఎపిక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫిర్యాదులకు ప్రత్యేకం ‘ఎన్జీఎస్‌’

ఓటర్లు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌ (ఎన్జీఎస్‌) పేరిట ఒక పోర్టల్‌ ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు. దేశ వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి చెందిన ఫిర్యాదులైనా ఇందులో నమోదు చేయవచ్చు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ వివరాలను పొందుపరిస్తే సంబంధిత నియోజకవర్గ అధికారులు వీటిని పరిశీలించి చర్యలు చేపడతారు.

అభ్యర్థి గురించి తెలుసుకోండిలా..

మీ అభ్యర్థి గురించి తెలుసుకునేందుకు నో యువర్‌ క్యాండిడేట్‌, కేవైసీ పేరిట ఒక వెబ్‌సైట్‌ ఉంది. అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసే ప్రమాణ పత్రాలు (అఫిడవిట్‌లు) ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. పోటీలో ఉన్న అభ్యర్థి ఎలాంటి వారు, వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా, వారికి ఏఏ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్థిర, చరాస్తుల వివరాలు, బంగారు ఆభరణాల వివరాలను తెలుసుకోవచ్చు.

‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌

ఎన్నికల్లో ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాప్‌ ఇది. ప్రజలు తాము గుర్తించిన అక్రమాలను సి-విజిల్‌ యాప్‌లో సంక్షిప్తంగా నమోదు చేయాలి. వంద నిమిషాల వ్యవధిలో అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో తెలుపుతారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం ఈ యాప్‌ ప్రత్యేకత.

దివ్యాంగుల చేయూతకు ‘సాక్ష్యం’

వయోవృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం సాక్ష్యం యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రానికి సొంతంగా రాలేని వారు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకు వచ్చేందుకు అధికారులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీని సమకూర్చుతారు.

Updated Date - Apr 25 , 2024 | 12:48 AM