Share News

జీవోల జారీలో అలసత్వం వద్దు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:53 PM

మున్సిపల్‌ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందపు జీఓలను జారీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని సిటు జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు విమర్శించారు

జీవోల జారీలో అలసత్వం వద్దు

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 6: మున్సిపల్‌ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందపు జీఓలను జారీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని సిటు జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు విమర్శించారు. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్మికులు సమ్మె విరమించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం జీఓలు జారీ చేయలేదని, వెంటనే జీఓలను జారీ చేయడం ద్వారా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌ కుమార్‌, గురువులు, లక్ష్మి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:53 PM