Share News

అక్కడ ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు

ABN , Publish Date - May 09 , 2024 | 12:16 AM

ఏ ప్రాంతానికైనా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. ఏవోబీలోని కొఠియావాసు లకు మాత్రం బ్రిటిష్‌ కాలం నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం విశేషం.

అక్కడ ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు
కొఠియా గ్రామం

- ఒకే రోజు ఏపీ, ఒడిశాల్లో పోలింగ్‌

- సందిగ్ధంలో కొఠియావాసులు

- అధిక పోలింగ్‌ తమ వైపే జరిగేలా ఇరు రాష్ట్రాల ప్రతినిధుల యత్నం

(సాలూరు రూరల్‌)

ఏ ప్రాంతానికైనా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. ఏవోబీలోని కొఠియావాసు లకు మాత్రం బ్రిటిష్‌ కాలం నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. స్వాతం త్య్రం రాక ముందు కూడా కొఠియావాసులు అటు కలకత్తా ప్రెసీడెన్సీ, ఇటు మద్రాస్‌ ప్రెసిడెన్సీ పాలనలో ఉండేవారు. స్వాతంత్య్రం అనంతరం 1952 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కొఠియావాసులకు ఏపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ఒడిశా నుం చి ఎమ్మెల్యే, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కొఠియావాసులకు ఏపీ నుంచి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రాతినిథ్యం వహిస్తు న్నారు. ఒడిశా నుంచి కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్‌ పాడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏవోబీలో ఉన్న కొఠియా గ్రూప్‌ 21 గ్రామాల్లో ఉన్న గిరిజ నులను ఇరు రాష్ట్రాలకు చెందిన వారుగా పరిగణిస్తున్నారు. వారికి రెండేసి ఓట్లు, రేషన్‌ కార్డులు, ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాలు, విద్య, వైద్య, వ్యవసాయ తదితర అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. కొఠియావాసులు సైతం ఇరు రాష్ట్రాల పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందడానికి ప్రయత్నిస్తారు.

ఒడిశా ముందు వరుసలో...

కొఠియాపై ఆధిపత్యానికి ఒడిశా ఒక అడుగు ముందులో ఉండి ఈ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రస్తుతం ఏపీ, ఒడిశాల్లో అసెంబ్లీలకు, లోక్‌ సభకు ఎన్నికలు జరుగుతు న్నాయి. అరకు, కొరాపుట్‌ లోక్‌సభ, సాలూరు, పొ ట్టంగి అసెంబ్లీ స్థానాలకు ఇరు రాష్ట్రాల్లో ఒకే రోజు మే 13న ఎన్నికలు జరగ నున్నాయి. ఏపీ నుంచి అరకు ఎంపీగా బీజేపీ తరఫున కొత్తపల్లి గీత, వైసీపీ నుంచి తనూజరాణి, సీపీఎం నుంచి పాచిపెంట అప్పలసరస తది తర 13 మంది పోటీ పడుతున్నారు. సాలూ రు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పీడిక రాజన్నదొర, టీడీపీ కూటమి అభ్యర్థిగా గుమ్మిడి సంధ్యారాణి, కాంగ్రెస్‌ నుంచి మువ్వల పుష్పారావు పోటీ పడుతున్నారు. కొరాపుట్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి సప్తగిరి ఉల్క, బీజేపీ నుంచి కాళిరామ్‌ మాఝి, బీజేడీ నుంచి కౌస ల్య హిక్కాక మరో ఇండి పెండింట్‌ పోటీ పడుతు న్నారు. పొట్టంగి ఎమ్మెల్యే గా బీజేడీ నుంచి ప్రపుల్‌ కుమార్‌ పాంగి, కాంగ్రెస్‌ నుంచి రామచంద్ర కడెం, బీజేపీ నుంచి చైతన్య నందివాల మరో ముగ్గురు స్వతంత్రులు పోటీ పడుతున్నారు. కొఠియావా సులకు రెండు రాష్ట్రా లకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నా రు. రెండు రా ష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు కావ డంతో ఏ రాష్ట్రానికి అధికంగా వారి మ ద్దతు ఉంటుందోననే ఉ త్కంఠ నెలకొంది. తమ రాష్ట్రా నికి అధికంగా ఓటింగ్‌ జరిగేలా ఒడి శా సకల ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కొఠియా వాసుల కోసం నేరేళ్లవలస, శిఖపరువు, కురుకూటిల్లో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఏపీ ఓటర్ల జాబితా ప్రకారం 2,554 మంది ఓటర్లు ఉన్నారు. ఒడిశా మాత్రం వారి గ్రామా లకు సమీపంగానే కొఠియా, పగులుచెన్నారు, ముడకారు, గంజాయిభద్ర, రణసింగి, గాలిగబడారు, తావుపొదర్‌, గెమ్మెల పొదర్‌, తురియాలో పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసింది. ఒడిశా జాబితా ప్రకారం 5,502 మంది ఓటర్లు ఉన్నారు. కొఠియావాసులు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Updated Date - May 09 , 2024 | 12:16 AM