రెండు ఆలయాల్లో చోరీలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:26 AM
మండలంలోని గట్రాజు కళ్లాలు వద్ద ఉన్న రెండు ఆలయాల్లో దొంగలు పడి వెండివస్తువులను, హుండీ లను ఎత్తుకుపోయారు.
శృంగవరపుకోట రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని గట్రాజు కళ్లాలు వద్ద ఉన్న రెండు ఆలయాల్లో దొంగలు పడి వెండివస్తువులను, హుండీ లను ఎత్తుకుపోయారు. ఈవిషయంపై స్థానికులు, ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి, పైడితల్లమ్మ ఆల యాల్లో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. పైడితల్లమ్మ ఆలయంలో వెండివస్తు వులతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ ఎత్తుకుపోయారన్నారు. హుండీలో రూ.30వేలకు పైగా నగదు ఉంటుందని స్థానికులు తెలిపారు. విజయ నగరంనుంచి క్లూస్ టీం వచ్చి ఆలయాలు చూసి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.