Share News

మహిళల మెడలో బంగారం చోరీ

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:10 AM

జియ్యమ్మవలస మండలం గడ్డతిరువాడ, పిప్పల భద్ర గ్రామాల మధ్య నడుచుకుని వెళ్తున్న మహిళల మెడలో నల్లపూసల తాడు, పుస్తెలతాడును దొంగలు తెంపుకుపోయిన ఘటన చోటు చేసుకుంది.

మహిళల మెడలో బంగారం చోరీ

జియ్యమ్మవలస, జూలై 4: జియ్యమ్మవలస మండలం గడ్డతిరువాడ, పిప్పల భద్ర గ్రామాల మధ్య నడుచుకుని వెళ్తున్న మహిళల మెడలో నల్లపూసల తాడు, పుస్తెలతాడును దొంగలు తెంపుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చినమేరంగి ఎస్‌ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలో గల పరజపాడు గ్రామానికి చెందిన బోని గంగ, నక్క పోల మ్మ గడ్డతిరువాడ గ్రామంలో జరిగిన సీమంతం కార్యక్రమానికి హాజరై బుధవా రం సాయంత్రం నడుచుకుని వస్తున్నారు. ఈ క్రమంలో గడ్డతిరువాడ, పిప్పల భద్ర గ్రామాల మధ్య పల్సర్‌ బైక్‌ పై ఒక వ్యక్తి వచ్చి గంగ మెడలో ఉన్న నల్ల పూసలతాడు, పోలమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడును తెంపే ప్రయత్నం చేయ గా సగం తెగి పడిపోవడంతో మిగిలిన సగం ముక్కలతో ఉడాయించారు. దీని పై మహిళలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిద్దరిదీ కలిపి తులంనర బంగారం పోయినట్లు తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 12:10 AM