Share News

నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:47 PM

: సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైం దని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ ఆరోపించారు. ఆదివారం రాజాంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ నియంతలా వ్యవహరి స్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీని పూర్తిగా ప్రజలు తరమికొట్టేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబునాయుడును అక్రమంగా ఇరికించి 53 రోజులు జైలులో పెట్టించారని, కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, కిమిడి అశోక్‌కుమార్‌, మరిపి జగన్మోహన్‌రావు, టంకాల నాగరాజు, పిన్నింటి మోహన్‌రావు పాల్గొన్నారు.ఫ ఆగూరులో మూడువేల మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం

రాజాం: సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైం దని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ ఆరోపించారు. ఆదివారం రాజాంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ నియంతలా వ్యవహరి స్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీని పూర్తిగా ప్రజలు తరమికొట్టేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబునాయుడును అక్రమంగా ఇరికించి 53 రోజులు జైలులో పెట్టించారని, కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, కిమిడి అశోక్‌కుమార్‌, మరిపి జగన్మోహన్‌రావు, టంకాల నాగరాజు, పిన్నింటి మోహన్‌రావు పాల్గొన్నారు.ఫ ఆగూరులో మూడువేల మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

టీడీపీలో చిన్నయ్యపేటవాసుల చేరిక

రేగిడి: మండలంలోని సంకిలి పంచాయతీ చిన్నయ్యపేటలోని వైసీపీకి చెందిన యువకులు టీడీపీలో చేరారు. రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహనరావు ఆధ్యర్యంలో ఆదివారం శ్యాంపురంలో క్యాంపు కార్యాలయంలో వైసీపీ యుత్‌ ప్రెసిడెంట్‌ బోర చంద్రశేఖర్‌ తదితరులు చేరినట్లు రేగిడి మండల టీడీపీ పార్టీ నేతలు దూబ ధర్మారావు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు మండల యువత అధ్యక్షుడు మజ్జి శ్రీనవాసరావు, కె.అశోక్‌కుమార్‌, కర్రి రమణ, గంగు కృష్ణారావు, గురువాన ధనంజయ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:48 PM