గత వైసీపీ పాలన ఫలితం..
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:56 PM
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భామిని మండలంలోని బిల్లుమడ రహదారి అధ్వానంగా మారింది. దారి పొడవునా భారీ గోతులతో ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయంగా మారడంతో బిల్లుమడ, పసుకుడి మధ్యలో పూటకో చోట లారీలు కూరుకుపోతున్నాయి.
పూటకో చోట కూరుకుపోతున్న లారీలు
భామిని: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భామిని మండలంలోని బిల్లుమడ రహదారి అధ్వానంగా మారింది. దారి పొడవునా భారీ గోతులతో ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయంగా మారడంతో బిల్లుమడ, పసుకుడి మధ్యలో పూటకో చోట లారీలు కూరుకుపోతున్నాయి. తరచూ ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బిల్లుమడ రోడ్డుపై గోతిలో ఓ లారీ దిగబడింది. దానిని తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. అదే సమయంలో సింగిడి వద్ద రోడ్డుపై మరో లారీ కూరుకుపోవడంతో మరో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా తిరగడంతో విద్యార్థులకు పడిగాపులు తప్పలేదు. ఇదిలా ఉండగా సింగిడి-బిల్లుమడ రోడ్డులో చెన్నై నుంచి ఒడిశాకు 90 చ క్రాల భారీ వాహనం వెళ్తున్నాయి. అయితే అవి ఏ గుంతలోనైనా దిగబడితే.. బత్తిలి వైపు వాహన రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.