Share News

భాష మారిపోయె

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:26 AM

ఓటరు జాబితాలో ఎన్నెన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. బొబ్బిలి పట్టణంలోని గెస్ట్‌హౌస్‌ కాలనీకి చెందిన ఇద్దరు ఓటర్ల పేర్లు జాబితాలో ఒరియా భాషలో కనిపిస్తుండడం గమనార్హం. నాయుడు రామ్మూర్తి (సీరియల్‌ నెంబరు 1363)పేరుతో పాటు మరో మహిళ పేరు (సీరియల్‌ నెంబరు 1221) ఒరియా, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్నాయి.

భాష మారిపోయె
ఓటరు పేర్లు ఒరియా భాషలో...

భాష మారిపోయె

తెలుగు ఓటర్లకు ఒరియాలో పేర్లు

బొబ్బిలి, జనవరి 28: ఓటరు జాబితాలో ఎన్నెన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. బొబ్బిలి పట్టణంలోని గెస్ట్‌హౌస్‌ కాలనీకి చెందిన ఇద్దరు ఓటర్ల పేర్లు జాబితాలో ఒరియా భాషలో కనిపిస్తుండడం గమనార్హం. నాయుడు రామ్మూర్తి (సీరియల్‌ నెంబరు 1363)పేరుతో పాటు మరో మహిళ పేరు (సీరియల్‌ నెంబరు 1221) ఒరియా, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్నాయి. తెలుగులో వారి పేర్లు లేవు. ఇతర వివరాలు మాత్రం తెలుగులో ఉన్నాయి. ఓటరు జాబితాలో పేర్లు ఒరియా భాషలో ఉండడంతో ఓటర్లతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఖంగుతిన్నారు. గుర్తింపు కార్డులో ఎడమ పక్కనున్న అన్ని వివరాలు తెలుగులో ఉండగా, ఓటరు పేరు ఒరియా భాషలో, ఇంగ్లీషు భాషలో కనిపిస్తున్నాయి.

ఒడిశా నుంచి బదిలీ అయిన ఓట్లు

బొబ్బిలి పట్టణం గెస్ట్‌హస్‌కాలనీకి చెందిన నాయుడు రామ్మూర్తి కుటుంబం ఒడిశా ప్రాంతంలో ఉపాధి కోసం ఎక్కువ కాలం ఉంటూ బొబ్బిలి ప్రాంతానికి తిరిగి వచ్చేశారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఉండే వారి ఓట్లను బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి మార్పు చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో అక్కడి ఒరియా భాషలో పొందుపరిచి ఉండవచ్చు.

- డి.హేమనాయుడు, బీఎల్‌ఓ, బొబ్బిలి

Updated Date - Jan 29 , 2024 | 12:26 AM