Share News

డంపింగ్‌యార్డు సమస్యకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:23 AM

నగర పంచాయతీ నుంచి సేకరించిన చెత్తను తరలించేందు కు శాశ్వత ప్రాతిపది కన డంపింగ్‌యా ర్డును ఏర్పాటు చేయాలని నగర పంచాయతీ కౌన్సిలర్‌ వెలమల మన్మథరా వు కోరారు.

డంపింగ్‌యార్డు సమస్యకు పరిష్కారం చూపాలి

పాలకొండ: నగర పంచాయతీ నుంచి సేకరించిన చెత్తను తరలించేందు కు శాశ్వత ప్రాతిపది కన డంపింగ్‌యా ర్డును ఏర్పాటు చేయాలని నగర పంచాయతీ కౌన్సిలర్‌ వెలమల మన్మథరా వు కోరారు. శనివారం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ యందవ రాధాకుమారి ఆధ్వర్యంలో చేపట్టిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పట్టణంలోని 1, 2, 20 వార్డులకు సంబంధించిన శివారు ప్రాంతాల్లో నగర పంచాయతీలోని చెత్తా చెదారాలను తరలించి డంప్‌ చేయడం ద్వారా ఆయా వార్డుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. దీనిపై ఇంతవరకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని కమిషనర్‌ సర్వేశ్వరరావును ప్రశ్నించారు. టీడీపారాపురం గ్రామం వద్ద డంపింగ్‌యార్డు స్థలం వివాదంలో ఉందని, డంపింగ్‌యార్డుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని సూచించారు. పట్టణంలో వీధి లైట్లు నిర్వహణ, పారిశుద్య పనులు అధ్వానంగా ఉన్నాయని, ప్రత్యేక దృష్టిసారించాలని మరో కౌన్సిలర్‌ కొరికాన గంగునాయుడు కోరారు. దీనిపై పర్యవేక్షణ చేస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా సాగునీటి సరఫరాకు ఐదు లక్షల రూపాయలు మేరకు నిధులు కేటాయిస్తున్నట్టు కమిషనర్‌ తెలిపారు. దీనిపై స్పందించిన వైసీపీ కౌన్సిలర్‌ మన్మథరావు ప్రతిఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ట్యాంకులకు అయ్యే ఖర్చును ఒకేసారి కొనుగోలు చేసి దుబారాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్లు రౌతు హనుమంతురావు, పల్లా ప్రతాప్‌ ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:23 AM