Share News

గజరాజుల బీభత్సం

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:10 AM

మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది.

గజరాజుల బీభత్సం
మట్టిలో కలిసిపోయిన మొక్కజొన్న కంకులను సేకరిస్తున్న రైతులు

కొమరాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి కుమ్మరిగుంట, కంబవలస, కందివలస, తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో ఏనుగులు సంచారించాయి. ఈ సమయంలో కంబవలసకు చెందిన గొర్లి సంగీతకు చెందిన మొక్కజొన్న గింజలను తొక్కిపెట్టి మట్టిలో కలిపేశాయి. సుమారు 50 బస్తాలకు పైగా మొక్కజొన్న గింజలు పాడైనట్లు బాధిత రైతు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులు ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:10 AM