చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 AM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి కె.శ్రీనివాస్ అన్నారు.

దత్తిరాజేరు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి కె.శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం గొబ్యాంలో క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకు ముందు స్థానికంగా పర్యటించారు. ఆయన వెంట జనసేన ఇన్‌చార్జి మర్రాపు సురేష్ ఉన్నారు. గొబ్యాంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎంపీటీసీ వంగపండు కృష్ణమూర్తినాయుడు, మాజీ సర్పంచ్ వంగపండు ఆలివేణి ఆధ్వర్యంలో వీరంతా చేరారు. వీరికి శ్రీనివాస్, సురేష్ పార్టీలోకి ఆహ్వానించారు.