Share News

చుర్రుమన్న సూర్యుడు

ABN , Publish Date - May 31 , 2024 | 11:53 PM

జిల్లాలో గత నాలుగైదు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చుర్రుమంటున్నాడు.

 చుర్రుమన్న సూర్యుడు
ఎండతీవ్రతకు కోట వద్ద మార్కెట్‌ ఇలా

- జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 31: జిల్లాలో గత నాలుగైదు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చుర్రుమంటున్నాడు. దీనికి తోడు వడగాడ్పులు వీస్తున్నాయి. జిల్లాలోని దత్తిరాజేరు, కొత్తవలస, గజపతినగరం, జామి, ఎల్‌.కోట, చీపురపల్లి, బాడంగి తదితర మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మరో మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది.

వడదెబ్బతో తాపీమేస్త్రి మృతి

వేపాడ, మే 31: వడదెబ్బకు గురై లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామానికి చెందిన తూర్పాటి సూరిబాబు (36) అనే తాపీమేస్త్రి మృతి చెందాడు. సూరిబాబు శుక్రవారం ఉదయం వేపాడ మండలం బొద్దాం గ్రామం వచ్చాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా ఎండ తీవ్రతకు బొద్దాం-పాటూరు మధ్యలోని ఓ చికెన్‌ దుకాణం వద్ద కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో సూరిబాబుకు స్థానికులు సపర్యలు చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని వల్లంపూడి ఎస్‌ఐ కె.రాజేష్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూరిబాబుకు భార్య ఉమ, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:53 PM