వైసీపీ పాలనలో బీసీలు దగా పడ్డారు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:26 AM
బీసీ విద్యార్థులకు సరైన ప్రోత్సాహకాలు అందక పోవడంతో ఇబ్బంది ప డుతున్నారని మాజీ ఎం ఎల్‌ఏ కేఏ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

గంట్యాడ: బీసీ విద్యార్థులకు సరైన ప్రోత్సాహకాలు అందక పోవడంతో ఇబ్బంది ప డుతున్నారని మాజీ ఎం ఎల్‌ఏ కేఏ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక బీఈడీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుతో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది ప డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక.. కొత్త ఉద్యో గాలు రాక నిరాశలో ఉన్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై అరాచకం జరుగుతోందన్నారు. ఈనెల 10న బొబ్బిలిలో జరిగిన రా..కదలిరా సభను వి జయవంతం చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గజపతినగరం నియోజ కవర్గం నుంచి 20 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మండల టీడీపీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, నాయకులు అల్లు విజయకుమార్, బూడి అప్పలనాయుడు, రంధి చినరామునాయుడు, రొంగళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ పూసపాటిరేగ: వైసీపీ ప్రభుత్వం బీసీలపై సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తోందని, బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పి అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. గురువారం రెల్లివలస గ్రామంలో టీడీపీ నాయకుడు మహంతి చిన్నంనాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తె లుగుదేశం హయాంలో బీసీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎత్తివేశారని ఆ రోపించారు. బీసీలు ఉన్న నియోజకవర్గాలకు చెందినవారిని దూరంగా ఉన్న నియోజ కవర్గాలకు మార్పు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతి వాడ తమ్మినాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, బ్రాహ్మణ సమితి కన్వీనరు ఇనుగంటి రాకేష్‌శర్మ, మండల నాయకులు ఇజ్జురోతు ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజాం: వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలు దగా పడ్డా రని తూర్పుకాపు కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు అన్నారు. గురు వారం రాజాం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. వైసీపీలో బీసీ నేతలకు, ప్రజలకు గౌరవం లేదన్నారు. నాలు గున్నరేళ్ల పాల నలో సీఎం జగన్‌రెడ్డి బీసీలను అణచివేసే ప్రయత్నం చేశారే తప్ప బీసీల అభ్యు న్నతికి పాటుపడలేదన్నారు. అనంతరం బీసీ నాయకులు మాట్లాడు తూ బీసీలకు చెందిన దాదాపు 30 సంక్షేమ పథకాలు రద్దుచేశారన్నారు. రిజరేషన్లు , పదవులు బీసీలకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో బీసీలంతా ఉమ్మ డిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బొత్స వాసుదేవరావునాయుడు, సుమ ల వెంక ట మన్మథరావు, గురవాన నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
ఫ విజయనగరం రూరల్: రాష్ట్రంలో బీసీలకు అవమానాలు తప్పితే.. వారి సంక్షేమం కోసం కృషి చేయడం లేదని టీడీపీ బీసీ సాధికారిత కమిటీ నాయకులు కంది మురళీనాయుడు, ముద్దాడ చంద్రశేఖర్, మామిడి దేవేంద్రనాథ్, కోండ్రు శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల పరిస్థితి దయనీయంగా మా రిందన్నారు. వైసీపీలో ఉన్న బీసీ ఎంపీలకు సైతం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమైన విషయమన్నారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కి జగన్ సామాజిక వర్గాన్ని ప్రొత్సహిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.