Share News

పేదల కడుపు నింపడమే ధ్యేయం

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:11 AM

పేదల కడుపు నింపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు.

పేదల కడుపు నింపడమే ధ్యేయం

పాలకొండ: పేదల కడుపు నింపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కోటదుర్గమ్మ ఆలయానికి సమీపంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు కేటాయించిన భవన పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టు 15న తొలి విడతగా ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావు, టీడీపీ నేత పల్లా కొండలరావు, పట్టణ, మం డల అధ్యక్షులు గంటా సంతోష్‌, గండి రామినాయుడు, నాయకులు సుంకరి అనిల్‌దత్‌, వెన్నపు శ్రీనివాసరావు, అంపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:11 AM