అభివృద్ధికి చిరునామా టీడీపీ
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:29 AM
అభివృద్ధిలో దేశానికి తలమానికం తెలుగుదేశం ప్రభుత్వమని... పేదవాడు ఆత్మగౌరవంగా బతకాలన్నదే ఎన్టీఆర్ ఆశయని టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అన్నారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో దేశానికి తలమానికం తెలుగుదేశం ప్రభుత్వమని... పేదవాడు ఆత్మగౌరవంగా బతకాలన్నదే ఎన్టీఆర్ ఆశయని టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అన్నారు. గురువారం నగరంలోని 1, 14వ డివిజన్‌లకు చెందిన సుమారు 80 కుటుంబాలు టీటీపీలో చేరాయి. వీరిలో 18వ డివిజన్ కార్పొరేటర్ మీసాల రమాదేవి తల్లిదండ్రులు కూడా అదితి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా అదితి మాట్లాడుతూ టీడీపీలో అశోక్ గజపతిరాజు సుదీర్ఘ కాలంగా ఉన్నారని.... పేదవారు ఆత్మగౌరవంతో బతకాలని... పక్కాఇళ్లు వారికి ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలుగుదేశంలో ప్రతిఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. కార్యకర్తలంతా నారా చంద్రబాబునాయుడుని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. అవనాపు విజయ్ మాట్లాడుతూ నగరంలో వైసీపీకి ఇవే చివరి ఎన్నికలని, భవిష్యత్ అంతా..టీడీపీదేనన్నారు. కాళ్ల గౌరీఈశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై నగర ప్రజలు విరక్తి చెందారని... అందుకే వందలాది కుటుంభాలు టీడీపీని గెలిపించేందుకు పార్టీలో చేరుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారిని అదితి గజపతి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పిళ్లా విజయ్‌కుమార్, నగర మాజీ యువత అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు, పతివాడ రాము, పతివాడ పార్వతి, ఆవాల అప్పలస్వామి, రోహిణి కుమార్ తదితరులు స్వాగతించారు.
వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం..
రాజాం: త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. అరసాడ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు గురువారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. అనంతరం కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పిన్నింటి మెహన్‌రావు, లచ్చుభక్త కృష్ణమూర్తి, మజ్జి వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నుంచి రాయి పల్లి అప్పలనాయుడు, రాయిపల్లి రమణ, గౌరీనాయుడు, కడగల జగన్నాథం, ఇప్పిలి వెంకటేష్, గంగులు, కాం బోతుల అప్పలనాయుడు, నారాయణరావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా రాజాం పురపాలక సంఘ పరిధిలోని ఆరో వార్డులో కోండ్రు మురళీమోహన్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సారధి రోడ్డులోని దివ్యాంగు ల పాఠశాలలో విద్యార్థులకు కేక్ పంచిపెట్టారు. కార్యక్రమంలో నంది సూర్య ప్రకాష్‌రావు, వంగా వెంకటరావు, అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.