Share News

బొద్దాంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:21 AM

మండల పరిధిలోని బొద్దాం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అధికార వైసీపీ నాయకుల ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొనడమే దీనికి కారణం.

బొద్దాంలో ఉద్రిక్తత

- వైసీపీ ప్రచారంలో వలంటీర్లు - ప్రశ్నించిన టీడీపీ శ్రేణులు

రాజాం రూరల్‌: మండల పరిధిలోని బొద్దాం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అధికార వైసీపీ నాయకుల ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొనడమే దీనికి కారణం. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొనడాన్ని ప్రశ్నించారు. తాము రాజీనామా చేశామని... ప్రశ్నించేందుకు మీకున్న అధికారం ఏమిటని వలంటీర్లు టీడీపీ శ్రేణులను ప్రశ్నించారు. దీంతో రాజాం ఎంపీడీఓ వావిలపల్లి శ్రీనివాసరావును వలంటీర్ల రాజీనామా వ్యవహారంపై టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. గ్రామంలో 24 మంది వలంటీర్లు ఉండగా... కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారని ఎంపీడీఓ స్పష్టం చేశారు. దీంతో ప్రచారం నుంచి వైదొలగాలని వలంటీర్లను టీడీపీ నేతలు గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న రాజాం టౌన్‌ సి.ఐ.మోహనరావు ఆధ్వర్యంలో పొలీసులు రాత్రి పది గంటల సమయంలో రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. అధికార పారీ ఎన్నికల ప్రచారంలో గ్రామ వలంటీర్లు నక్క గణేష్‌, మూకళ్ల లక్ష్మి, నక్క ధనలక్ష్ష్మి, బట్న వెంకట లక్ష్మి, నక్క పార్వతి, మూకళ్ల శిరీష, బెండు లక్ష్మణరావు, బట్న భాగ్యలక్ష్మి, బట్న లక్ష్మి, అలజంగి లాస్య పాల్గొన్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరందరినీ విధుల నుంచి తప్పించాలని టీడీపీ నాయకులు హరి, విష్ణు, సూర్యనారాయణ తదితరులు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.... గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని సి.ఐ.మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 12:21 AM