Share News

జిల్లాలో కొత్తగా పది వేల మంది ఓటర్లు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:06 AM

ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత ఇప్పటి వరకూ జిల్లాలో సుమారు పది వేలు మంది కొత్త ఓటర్లుగా చేరారని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలి పారు.

జిల్లాలో కొత్తగా పది వేల మంది ఓటర్లు

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3: ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత ఇప్పటి వరకూ జిల్లాలో సుమారు పది వేలు మంది కొత్త ఓటర్లుగా చేరారని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలి పారు. కొత్త ఓటర్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14 వరకూ అవ కాశం ఉందన్నారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పలు అంశాలపై సూ చనలు ఇచ్చారు. ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పు మాత్రమే జరుగుతుందని, మిగిలిన వాటికి అవకాశం లేదన్నారు. 18 ఏళ్లలోపు బాల బాలికలను రాజకీయ కార్యకలా పాల్లో వినియోగించకూడదన్నారు. పార్టీల ప్రచారం, పాంప్లెట్లు, జెండాల పంపిణీ, ర్యాలీలు, నినాదాలు ఇవ్వడంతోపాటు రాజకీయ పార్టీలు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలను వినియోగించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో ఉన్న హోర్డింగులను రాజకీయ పార్టీల ప్రచారానికి కేటా యించబోమని తెలిపారు. ప్రైవేటు భవనాలు, ఇళ్లలో ఒక స్టిక్కర్‌, చిన్నపాటి జెండా లేదా బ్యానర్‌ను పెట్టుకోవచ్చని, అయితే ఆ ఇంటి యజమాని నుంచి అను మతి పత్రం తీసుకుని 3 రోజుల్లో సమర్పించాలని సూచించారు. ప్రస్తు తం రాజకీయ పార్టీలు చేసే వ్య యం అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుంద ని, నామినేషన్‌ దాఖలు చేసిన తరు వాత అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారన్నా రు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచా రంలో విభిన్న ప్రతిభావంతులను కించపరిచే పదాలను వాడవద్దని సూచించారు. కుంటి, గుడ్డి ప్రభుత్వాలు అనే పదాలను వాడటం వల్ల దివ్యాంగుల మనోస్దైర్యం దెబ్బతింటోందని, వారు తీవ్ర మనస్తాపం చెందుతూ తమకు ఈ మేరకు విజ్ఞిప్తి చేశారని చెప్పారు. కార్యక్ర మంలో జేసీ కార్తీక్‌, డీఆర్‌వో అనిత, వివిధ నియోజకవర్గాల ఆర్‌వోలు, నోడల్‌ అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:06 AM