అధ్యాపకులూ పనితీరు మార్చుకోండి
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:01 AM
జిల్లాలోని 11 ప్రభుత్వ జానియర్ కాలేజీల్లో 50 శాతం కంటే తక్కువ ఫలితాలు రావడంపై కలెక్టర్ అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా లెక్చరర్ల పని తీరు మారకపోతే కమిషనర్‌కు ఫీడ్ బ్యాక్ ఇస్తానన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధ్యాపకులూ పనితీరు మార్చుకోండి
కమిషనర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇస్తా
కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 ప్రభుత్వ జానియర్ కాలేజీల్లో 50 శాతం కంటే తక్కువ ఫలితాలు రావడంపై కలెక్టర్ అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా లెక్చరర్ల పని తీరు మారకపోతే కమిషనర్‌కు ఫీడ్ బ్యాక్ ఇస్తానన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వార్టర్లీ పరీక్షల్లో జిల్లాలోని 18 కళాశాలల్లో పాసైన విద్యార్థుల సంఖ్య 41 శాతం మాత్రమేనని, అంత ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి కారణం ఏమిటని ఆరా తీశారు. ఇదే పరిస్ధితి కొనసాగతే సహించేది లేదని, ఫెయిల్ కావడానికి కారణాలను తరగతి వారీగా విశ్లేషించుకుని, వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక సమయం తీసుకోవాలని చెప్పారు. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలిన చేస్తామని, లెక్చరర్లు రెగ్యూలర్‌గా వస్తే విద్యార్థులూ రెగ్యులర్‌గా హాజరవుతారని చెప్పారు.
- మెగా పేరెంట్ టీచర్ల సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, మధుర స్మృతులను మిలిల్చేలా ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 7న నిర్వహించే మెగా సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులను, యాజమాన్య కమిటీని, దాతలను భాగస్వాములను చేయాలని చెప్పారు. దీని కోసం గురువారం నుంచి పాఠశాలల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఒక రోజు ముందే పింఛన్
డిసెంబరు ఒకటి ఆదివారం కావడంతో ఒక రోజు ముందే నవంబరు 30న శనివారం పింఛన్ పంపిణీ చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అవసరమైన నగదును శుక్రవారమే డ్రా చేసుకుని శనివారం ఉదయం 6 గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభించాలని చెప్పారు.