Share News

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:59 PM

ప్రభుత్వం దాటవేత ధోరణి మానుకొని, తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చెయ్యాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌ చేసింది. కోట జంక్షన్‌ వద్ద మంగళవారం నిరుద్యోగులు ధర్నాకు దిగారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి
విజయనగరం: కోట జంక్షన్‌లో ధర్నా చేస్తున్న నిరుద్యోగులు

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌

కోట జంక్షన్‌ వద్ద ధర్నా.. రాస్తారోకో

విజయనగరం (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దాటవేత ధోరణి మానుకొని, తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చెయ్యాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌ చేసింది. కోట జంక్షన్‌ వద్ద మంగళవారం నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షెక్‌సిద్ధిక్‌, కో- కన్వీనర్‌ పవన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు తాను అధికారంలోకి వస్తే 25 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం వచ్చినా డీఎస్సీ ప్రకటన మాత్రం ఇవ్వలేదని, 10 లక్షల మంది నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు. మంత్రులు, ప్రజాప్ర తినిధులను రోడ్లమీదకు రానివ్వబోమని.. మెగా డీఎస్సీ ఇవ్వనంటే ఇళ్లు ముట్టడిస్తామని, ప్రచారా నికి రానివ్వకుండా చేస్తామని హెచ్చరించారు. డీఎస్సీపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని, లేకపోతే 2024లో నిరుద్యోగుల సత్తాచూపిస్తామ న్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:59 PM