Share News

విద్యార్థుల మరణాలపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:56 AM

గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాల ని పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల మరణాలపై చర్యలు తీసుకోండి

బెలగాం: గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాల ని పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏపీ ఎన్జీవో భవనంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు పి.రంజిత్‌ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల మరణాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పలు గిరిజన సంఘాలు, సీపీఐ, రైతు సంఘాల నాయ కులు హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో నలుగురు గిరిజన విద్యార్థులు మృతి చెందినా అధికారులు పరామర్శించలేదని ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన పాఠశాలల్లో, కళాశాలల్లో, వసతి గృహాల్లో తరచుగా వైద్య శిబిరాలు నిర్వ హించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు అమర్నాధ్‌, టి.సాయిబాబు, రామకృష్ణ, సురేష్‌, కె.రాజు, ఎ.ప్రభాకర్‌, ఈవీ నాయుడు, పి.సంగం తదితరులు పాల్గొన్నారు.

ఆ మరణాలకు కారణమేంటి?

జియ్యమ్మవలస: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల కాలంలో పిట్టల్లా రాలిపోతున్నారని... అసలేం జరుగుతోందని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక చంద్రశే ఖర్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విద్యార్థుల మర ణాలకు పౌష్టికాహారం లోపమో లేక వైద్యాధికారుల నిర్లక్ష్యమో తెలియడం లేద న్నారు. ఇటీవల విద్యార్థులు అనారోగ్యంతో ఆరోగ్య కేంద్రాలకు వెళుతుంటే రోగాన్ని గుర్తించకుండా తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి పంపిస్తున్నారని తెలిపా రు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వా లని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 12:56 AM