నిలకడగా నాగావళి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:42 PM
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది.

- అప్రమత్తమైన తోటపల్లి ప్రాజెక్టు అధికారులు
గరుగుబిల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులోకి పైనుంచి 1500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అధికారులు నది నుంచి కిందకు 150 క్యూసెక్కులు, ప్రధాన కాలువల నుంచి సాగునీటి అవసరాల నిమిత్తం 1,420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను ప్రస్తుతం 102.57 మీటర్ల నీరు నిల్వ ఉంది. తుఫాన్‌తో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అధికంగా వర్షాలు కురిసిన పక్షంలో సమాచారం అందించాలని ప్రాజెక్టు డీఈ టి.రఘునాథనాయుడు, జేఈలు శ్రీనివాసరావు, కిషోర్‌కుమార్.. ఒడిశా అధికారులను కోరారు.