Share News

వెయిట్‌లిఫ్టింగ్‌లో సుస్మిత ప్రతిభ

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:45 PM

అరుణాచలప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి సుస్మిత యూత్‌ విభాగంలో 55 కిలోల కేటగిరిలో పాల్గొని, బంగారు పతకం సాధించిందని కోచ్‌ చల్లా రాము తెలిపారు.

  వెయిట్‌లిఫ్టింగ్‌లో సుస్మిత ప్రతిభ

నెల్లిమర్ల: అరుణాచలప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి సుస్మిత యూత్‌ విభాగంలో 55 కిలోల కేటగిరిలో పాల్గొని, బంగారు పతకం సాధించిందని కోచ్‌ చల్లా రాము తెలిపారు. ఆయన సోమవారం స్థానిక విలేకర్లకు ఈ విషయాన్ని వెల్లడించారు. సుస్మిత యూత్‌ విభాగంలో బంగారు పతకంతో పాటు జూనియర్స్‌ విభాగంలో పాల్గొని, రజత పతకం సాధించిందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా సుస్మితను కోచ్‌తో పాటు జిల్లా వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెల్లాన లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేషన్‌ ప్రతినిధులు లక్ష్మి, ధింసాబాబు, బడేటి వెంకటరామయ్య అభినందించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:45 PM