Share News

అంతటా నిఘా

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:44 PM

ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు జిల్లాను జల్లెడపడుతున్నారు. 24/7 సాయుధ బలగాలతో వివిధ మార్గాల్లో తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యం సీజ్‌ చేస్తున్నారు.

అంతటా నిఘా
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

అంతటా నిఘా

అంత ర్‌ జిల్లా చెక్‌పోస్టులు 4 , సాధారణ చెక్‌పోస్టులు 21

మద్యం.. డబ్బు తరలింపుపై 38 కేసులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 18 : ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు జిల్లాను జల్లెడపడుతున్నారు. 24/7 సాయుధ బలగాలతో వివిధ మార్గాల్లో తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యం సీజ్‌ చేస్తున్నారు. ఈ ఘటనల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులపై 38 కేసులను నమోదు చేశారు. జిల్లాలోకి అక్రమంగా మద్యం, డబ్బులు, ఇతరత్రా వస్తు సామగ్రి ప్రవేశించకుండా 4 అంతర్జాతీయ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి జిల్లాకు వచ్చే రాజాపులోవ జంక్షన్‌ వద్ద ఒకటి, ఎస్‌.కోట నియోజకవర్గంలోని బొడ్డవర, రాజాం సమీపంలోని పొగిరి, బొబ్బిలి వద్ద ఒకటి ఏర్పాటు చేఽశారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గ పరిధిలో 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 18వ తేదీ నుంచి కోడ్‌ అమలు కావటంతో అప్పటి నుంచి తనిఖీలకు ఉపక్రమించారు. ధ్రువీకరణపత్రాలు లేకుండా తీసుకువెళ్లే చీరలు, వెండి, బంగారం, క్రీడా సామగ్రి, ప్రచార సామగ్రీ, నగదును సీజ్‌ చేస్తున్నారు. గురువారం నుంచి మూడు సిఫ్ట్‌లుగా పోలీసులు, రెవెన్యూ, ఎలక్షన్‌ బృందాలు నిఘా పెంచాయి. ఇదే విషయమై ఎస్పీ దీపిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, హద్దుమీరితే కేసులు తప్పవని చెప్పారు. తాజాగా పట్టణాలు, నగరం, గ్రామాల్లో ఇన్మఫర్‌మేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:44 PM