Share News

ఎన్నికల వేళ ఇసుకాసురులపై నిఘా

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:24 AM

ఎన్నికల వేళ అధికారులు ఇసుకా సురులపై దృష్టి సారించా రు. బొబ్బిలి మండలంలో పారాది, కారాడ, అలజంగి, పెంట తదితర గ్రామాల పరిధిలో వేగావతి నదీ ప రీవాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్ర మంగా రవాణా అవు తోంది.

ఎన్నికల వేళ ఇసుకాసురులపై నిఘా

బొబ్బిలి: ఎన్నికల వేళ అధికారులు ఇసుకా సురులపై దృష్టి సారించా రు. బొబ్బిలి మండలంలో పారాది, కారాడ, అలజంగి, పెంట తదితర గ్రామాల పరిధిలో వేగావతి నదీ ప రీవాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్ర మంగా రవాణా అవు తోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో రాజకీయ పార్టీ నాయకుల ప్రాబ ల్యం కొంతమేర తగ్గింది. దీంతో అధికారులు ఓ అడుగు ముందుకేశారు. తహసీ ల్దారు పి.త్రినాథరావునాయుడు, ఆర్‌ఐ కల్యాణచక్రవర్తి, ఎస్‌ఐ లోవరాజు, వీఆర్‌ఓ రవి తదితరుల బృందం సోమవారం అలజంగి, కారాడ, పెంట, పారాది గ్రామాల్లో ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. యంత్రాలను వినియోగించి ఇసుకను అక్రమంగా తరలిస్తూ తొలిసారి పట్టుబడితే రూ.25 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చ రించారు. మూడోసారి పట్టుబడితే వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత గ్రామ రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు. గ్రామాలలో దండోరా ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని వీఆర్వోలను, వీఆర్‌ ఏలను అదేశించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 26 , 2024 | 12:25 AM