విద్యార్థులు కష్టపడి చదవాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:59 PM
ప్రతివిద్యార్థి ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదవాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

విజయనగరం రింగురోడ్డు: ప్రతివిద్యార్థి ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదవాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయన గరంలోని కస్పా హైస్కూల్‌లో విద్యార్థులకు విద్యాకిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనా యుడు, జడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ గౌస్, మాజీ కౌన్సిలరు చెన్నా రూపా వాణి, కమిషనర్ ఎంఎం నాయుడు, హెచ్‌ఎం శంకరరావు, ఎంఈవో రాజు,టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్‌పాల్గొన్నారు. కాగా విజయనగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎమ్మెల్యే అదితిగజపతిరాజు ప్రిన్సిపాల్ పద్మలీల, డీఎం హెచ్‌వో భాస్కరరావుతో కలిసి అన్నివిభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా బోధనపై ఆరాతీశారు. కార్యక్రమంలో ప్రభుత్వఆసుపత్రి సూపరిటెండెంట్ ఎస్.అప్పలనాయుడు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు..