Share News

గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:10 AM

గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో కొండశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదని ఆదివాసీ గిరిజన సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ తెలిపారు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో కొండశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదని, ఈ సమస్యలపై ఈనెల 8న భద్రగిరి ఐటీడీఏ డీఈ ఇంజినీర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని ఆదివాసీ గిరిజన సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. మండలంలోని దేరువాడ, వనకా బడి, జర్న, దిగువచోరుపల్లి, నొండ్రుకోన వంటి గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కోశాధికారి మండంగి రమణ, నాయకులు శంకరరావు, మోహన్‌రావు, సన్యాసిరావు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:10 AM