అంతర్రాష్ట్ర రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:17 AM
కోమట్లపేట సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి మధ్యలో విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న బొగ్గు లారీ కట్ ప్లేట్లు, హౌసింగ్ బోల్టులు విరిగిపోవడంతో ఆదివారం ఉదయం ఆరు గంటలప్రాంతంలో రహదారి మధ్యలో నిలిచి పోయింది
లకొమరాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కోమట్లపేట సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి మధ్యలో విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న బొగ్గు లారీ కట్ ప్లేట్లు, హౌసింగ్ బోల్టులు విరిగిపోవడంతో ఆదివారం ఉదయం ఆరు గంటలప్రాంతంలో రహదారి మధ్యలో నిలిచి పోయింది. దీంతో రహదారికి ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. కేవలం ఆటోలు, కార్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. భారీలోడుకావ డంతో అన్‌లోడ్‌చేసి మరమ్మతులు చేయాలని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ లారీని పక్కకు తీసే ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడుతున్నారు.కూనే రు, రాయగడ తదితర ప్రాంతాలకు వెళ్ల వలసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దుచే శారు. దీంతో ప్రయాణికులు ఆటోల్లో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారడంతో వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు.