Share News

అంబేడ్కర్‌ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ABN , Publish Date - May 25 , 2024 | 11:58 PM

ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఐదో తరగతి, ఇంటర్‌ సీట్లకు ఈ నెల 28 నుంచి 31 వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ టి.పద్మజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

 అంబేడ్కర్‌ గురుకులాల్లో   స్పాట్‌ అడ్మిషన్లు

సాలూరు రూరల్‌, మే 25: ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఐదో తరగతి, ఇంటర్‌ సీట్లకు ఈ నెల 28 నుంచి 31 వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ టి.పద్మజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పది అంబేడ్కర్‌ గురుకులాలు ఉండగా, వాటిలో నాలుగు బాలురు, ఆరు బాలికలవి ఉన్నాయని పేర్కొన్నారు. బాలురు గురుకులాల్లో ఐదో తరగతి మిగులు సీట్లుకు ఈ నెల 28న బాడంగి గురుకులంలో , ఇంటర్‌ ప్రథమ ఏడాది ఖాళీ సీట్లకు ఈ నెల 30న అదేచోట స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఇంటర్‌లో ప్రవేశం కోసం పదో తరగతి మార్క్‌ జాబితాతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని కోరారు. ఐదో తరగతికి లాటరీ పద్ధతిలో, ఇంటర్‌ ప్రథమ ఏడాదికి పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తామన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:58 PM