Share News

క్రీడా మైదానం కాదండోయ్‌!

ABN , Publish Date - May 26 , 2024 | 11:00 PM

పార్వతీపురం మండలం ఎల్‌ఎన్‌పురం శివారు ప్రాంతంలో చెరువు పరిస్థితి ఇది. చుక్క నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం ఇది క్రీడా మైదానాన్ని తలపిస్తోంది.

క్రీడా మైదానం కాదండోయ్‌!
ఎల్‌ఎన్‌పురం శివారు ప్రాంతంలో చెరువు ఇలా..

పార్వతీపురం మండలం ఎల్‌ఎన్‌పురం శివారు ప్రాంతంలో చెరువు పరిస్థితి ఇది. చుక్క నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం ఇది క్రీడా మైదానాన్ని తలపిస్తోంది. కొన్ని నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మరోవైపు ఎండ తీవ్రత దృష్ట్యా మండలంలో అనేక చెరువులు ఇలానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. చెరువుల్లో నీరు లేకపోవడంతో మూగజీవాలు, పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోతే.. రానున్న ఖరీఫ్‌కు అవస్థలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- పార్వతీపురం రూరల్‌

Updated Date - May 26 , 2024 | 11:00 PM