Share News

మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:15 AM

మత్స్యకారు లు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తు న్నామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వరి

గరుగుబిల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారు లు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తు న్నామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. గురువారం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 6 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టుపై ఆధారపడిన గిరిజ న మత్స్యకారులకు పార్వతీ పురం ఐటీడీఏ నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తు న్నామని చెప్పారు. అలాగే 4 లక్షల చే పిల్లలను ఇతర ప్రాంతాల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్‌ సమీపంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన హెచరీ కోసం స్థలం మంజూరుకు చర్యలు చేపడుతున్నా మని చెప్పారు. అలాగే మత్స్యకారులకు లైసెన్సుల మంజూరుకు కృషి చేస్తు న్నామన్నారు. సమస్యల ను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో పరిష్కారా నికి చొరవ చూపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి.తిరుపతయ్య, పాలకొండ డివిజన్‌ మత్స్యశాఖ అధికారి డి.గోపీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు ఎం.సింహాచలంనాయుడు, మత్స్యకార సంఘ అధ్యక్షులు తిరుపతిరావు, టీడీపీ ప్రతిని ధులు ఎ.మధుసూదనరావు, ఎం.పురుషోత్తం నాయుడు, డి.సత్యనారాయణ, ఎ.రాంబాబు, ఎంవీ విజయవాంకుశం, ఎం.నారాయణ స్వామి, పి.వెంకట నాయుడు, పి.పూర్ణచంద్ర రావు, ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:15 AM