Share News

ఎన్నికల కోడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:27 AM

ఎన్నికల కోడ్‌ అమలులో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో జి.రామారావు సూచించారు.

ఎన్నికల కోడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

నెల్లిమర్ల: ఎన్నికల కోడ్‌ అమలులో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో జి.రామారావు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కోడ్‌ అమలుకు సంబంధించి ఆదివారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ కోడ్‌పై ముందుగా ఉద్యోగులు అవగాహన చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ నాయకులకు సంబంఽధించి ఎలాంటి చిత్రపటాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఉన్నా తొలగించాలని అన్నారు. అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు ధరించాలని సూచించారు. కొడ్‌ అమలులో ఉద్యోగులు ఎలాంటి రాజీ ధోరణి ప్రదర్శించరాదని, కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ధర్మరాజుతో పాటు ఈవోపీఆర్డీ కె.సింహాద్రి పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

విజయనగరం క్రైం: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఆయా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని టూటౌన్‌ సీఐ కోరాడ రామారావు హెచ్చ రించారు. ఎస్పీ దీపికా ఆదేశాలతో శనివారం నగరం లోని లాడ్జిల్లో విస్తృత తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులకు ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రవేశం ఇవ్వరాదన్నారు. అసాంఘిక కార్యక్రమా లు నిర్వహించినా, అక్రమంగా మద్యం, నగదు నిల్వలు ఉంటే, చర ్యలు తప్పవని హెచ్చరించారు.

నేరడిలో పోలీసు కవాతు

భామిని: ఎన్నికలు ప్రశాంతం గా జరిగేందుకు పోలీసు బలగాలు, ప్రత్యేక బృందాలు ఆదివారం నేరడి గ్రామంలో కవాతు నిర్వహించాయి. ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శిర్లి ఎల్లమ్మ జాతర జరుగుతు న్నందున ప్రశాంతం గా జాతర నిర్వహించాలని ఆలయ కమిటీకి సూచించారు.

Updated Date - Mar 18 , 2024 | 12:27 AM