Share News

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:25 AM

నిర్వాసిత సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి కోరారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా

జియ్యమ్మవలస: నిర్వాసిత సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి కోరారు. మండలంలోని బిత్రపాడు, బట్లభ ద్ర, నిమ్మలపాడు, సీమనాయుడు వలస, బాసంగి, బాసంగి గదబ వలస, పెదమేరంగి గ్రామాల్లో సోమవారం ఆమె టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిత్రపాడు గ్రామం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ నిర్వాసిత సమస్యల పరిష్కారం విషయంలో టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ఆర్‌.అప్పలకొండ, గుంపమ్మ, తదితరులు ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేశారు.

బిత్రపాడులో 20 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. టీడీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జగదీశ్వరికి మద్దతుగా..

గుమ్మలక్ష్మీపురం: లోవముఠా ప్రాంతంలోని మూలిగూడ, కుందుకు, రాయఘడ, జమ్ము, చాపరాయి, బెండి, బాతుగొడవ, పింగువ గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి, కూటమి అభ్యర్థి జగదీశ్వరిని గెలిపించాలని కోరారు. కడ్రక మల్లేశ్వరరావు, మండంగి భూషణరావు, కళావతి తదితరులు పాల్గొన్నారు.

కురుపాం రూరల్‌: కూటమి అభ్యర్థి తోయిక జగదీశ్వరిని, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరుతూ గుమ్మిడిగూడ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో టీడీపీ నాయకులు సోమవారం ప్రచారం చేశారు. పార్టీ మండల కన్వీనీరు కలిశెట్టి కొండయ్య ఆధ్వర్యంలో కోలా రంజిత్‌కుమార్‌, రమణమూర్తి, వెంపటాపు భారతి, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: మండల కేంద్రంలో సోమవారం టీడీపీ ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయుడు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, అక్కేన మధుసూదనరావు ప్రచారం నిర్వహించారు. అంబ టి తవిటినాయుడు, ఎం.తవిటినాయుడు, ముదిలిబాబు విజయవాంకుశం, తదితరులు పాల్గొన్నారు.

కొమరాడ: రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌ అన్నారు. రాయపురం, తులసివలస, కెమిశీల, లాబేసు, తదితర గ్రామాల్లో టీడీపీ మండల కన్వీనర్‌ ఉదయశేఖర్‌ పాత్రుడు ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తులసివలస గ్రామంలో మోహనరావు ఆధ్వర్యంలో వీరేష్‌ సమక్షంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Updated Date - Apr 30 , 2024 | 12:25 AM