Share News

సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించండి

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:01 AM

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి జేసీ సి.విష్ణుచరణ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

 సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించండి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి జేసీ సి.విష్ణుచరణ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ సి.విష్ణుచరణ్‌, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.హేమలతతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 140 అర్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నా థం, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకరరావు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి సిబ్బంది నిరసన

గరుగుబిల్లి: ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవా రం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కంప్యూటర్‌ ఆపరేటర్ల జిల్లా సంఘ అధ్యక్షుడు అంబటి శంకరరావు, టెక్నికల్‌ అసిస్టెంట్ల అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, కార్యదర్శులు సురేష్‌, రామకృష్ణ.. ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌కు వినతిపత్రం అందించా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఒత్తిడి ఎక్కువ, వేతనం తక్కువగా ఉందని వాపోయారు. ఉపాధిలో ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తే సిబ్బందిని ఎఫ్‌టీ ఈఎస్‌గా గుర్తించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే వారం రోజుల్లో సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందించారు.

ఐటీడీఏ స్పందనకు 35 వినతులు

సీతంపేట: ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 35 వినతులు వచ్చినట్టు ఐటీడీఏ పీవో కల్పనాకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రోసిరెడ్డి, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సింహాచలం, ట్రాన్స్‌కో ఈఈ కృష్ణమూర్తి, సీడీపీవో రంగలక్ష్మి, డీడీ అన్నదొర, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

న్యాయం చేస్తాం

బెలగాం: స్పందనలో వచ్చే ఫిర్యాదులను చట్టంపరంగా విచారణ జరిపి, తగిన న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయం లో ఆయన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్పందనలో మొత్తం ఆరు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ శాఖ బాధితులకు న్యాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఉద్యోగాల పేరుతో మోసపోవ డం తదితర ఫిర్యాదుల వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్‌, ఎస్బీ సీఐ లక్ష్మణరావు, డీసీఆర్‌బీ సీఐ వాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 01:01 AM