Share News

క్రీడా రంగంలో రాణించాలి: డీఈవో

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:34 PM

విద్యార్థులు విద్యతోపాటు క్రీడారంగంలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ కోరారు. సోమవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సౌత్‌ఇండియా కరాటే పోటీల్లో పతకాలు సాధించి న విద్యార్థులను అభినందించారు.

   క్రీడా రంగంలో రాణించాలి: డీఈవో

విజయనగరందాసన్నపేట:విద్యార్థులు విద్యతోపాటు క్రీడారంగంలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ కోరారు. సోమవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సౌత్‌ఇండియా కరాటే పోటీల్లో పతకాలు సాధించి న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరాటేలో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో పెంకి అశ్విని, హుమన్‌ రైట్స్‌ ప్రతినిధి పాండ్రంకి సంతోష్‌కుమార్‌, ఎం.అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:34 PM